భారతదేశం, మార్చి 10 -- Chittoor Murder: చిత్తూరు జిల్లా పుత్తూరు మండ‌లం చిన్న‌రాజుకుప్పంలో అన్న కొడుకును సొంత బాబాయి హత్య చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం పుత్తూరు మండంల చిన్న‌రాజుకుప్పం గ్రామంలో సుబ్బ‌రాయుడు, వెంక‌టేష్ అన్న‌ద‌మ్ములున్నారు.

దివ్యాంగుడైన వెంక‌టేష్ టైల‌ర్ ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. సుబ్బ‌రాయుడి కుమారుడు మ‌ణికంఠ (29) ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివి తిరుప‌తి స‌మీపంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ప‌ని చేస్తున్నాడు.

మ‌ణికంఠకి త‌మిళ‌నాడు రాష్ట్రం తిరుత్త‌ణి స‌మీపంలోని కేజీకండ్రిగ పంచాయ‌తీలోని ఆర్‌కే పురానికి చెందిన జ‌న‌నీతో పెళ్లి జ‌రిగింది. మ‌ణికంఠ‌, జ‌న‌నీ దంప‌తుల‌కు ఏడాది వ‌య‌సున్న కుమారుడు ఉన్నాడు. ప్ర‌స్తుతం భార్య మ‌ళ్లీ మూడు నెల‌ల గ‌ర్భిణిగా ఉంది. ఆదివారం ఉద‌యం నుంచి మ‌ణికంఠ, చిన్నాన్న వెంక‌ట...