భారతదేశం, ఆగస్టు 3 -- Chittoor Jobs : చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యాల్లో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆగ‌స్టు 10 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు కోరుతున్నారు.

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని ఖాళీగా ఉన్న 26 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా పీడీ నాగ‌శైల‌జ కోరారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కాంట్రాక్టు పద్ధతిలో భ‌ర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు. ఇందులో అర్హులైన అభ్యర్థుల‌కు మాత్రమే ...