భారతదేశం, మార్చి 6 -- ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం ప‌ట్ట‌ణంలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిత్తూరు జిల్లా గుడుప‌ల్లె మండ‌లం అగ‌రం కొత్తూరు గ్రామానికి చెందిన శివ‌ప్ప‌, ఈశ్వ‌రి దంప‌తులు వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ దంప‌త‌ుల‌కు కౌస‌ల్య ఒక్క‌గానొక్క కూతురు. ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. కౌస‌ల్య ఇప్పుడు డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది.

అదే గ్రామానికి చెందిన కోదండ‌ప్ప కుమారుడు చంద్ర‌శేఖ‌ర్‌ వ్య‌వ‌సాయ కూలీ ప‌నులు చేస్తోన్నాడు. వీరిద్ద‌రూ గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాల‌కు చెందిన‌వారు. కౌస‌ల్య, చంద్ర‌శేఖ‌ర్‌ల ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌డంతో.. శివప్ప త‌న కూతురు కౌస‌ల్య‌ను మంద‌లించాడు. డిగ్రీ చ‌దువుతున్న అమ్మాయిని వ్య‌వ‌సాయ కూలీకి ఇచ్చి వివాహం చే...