భారతదేశం, ఫిబ్రవరి 2 -- Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి- చెన్నై మార్గంలో లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదంలో వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారధి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన మణిగండ (8)తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందిన చిన్నమలై (55) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

తిరుపతికి చెందిన సుబ్బరత్నమ్...