భారతదేశం, మార్చి 3 -- రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో వైసీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే.. రేపు అదే రిపీట్ అవుతుందని.. మాజీమంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. జ‌గ‌న్ వస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారని స్పష్టం చేశారు. వైసీపీ వారికి తెలిసో, తెలియకో ఎటువంటి సహాయం చేయొద్దు అన్నారంటే.. ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.

'చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి, 30 వేల మంది మహిళలు వైసీపీ హయాంలో మాయ‌మ‌య్యార‌న్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీ...