భారతదేశం, ఫిబ్రవరి 9 -- మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. ఆయన హీరోగా నటించిన విశ్వంభర ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, చిరూతో మూవీ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులను జోరుగా చేస్తున్నారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో రీసెంట్‍గా భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు అనిల్ రావిపూడి. దీంతో చిరంజీవితో ఆయన చేసే మూవీ ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు నేడు (ఫిబ్రవరి 9) చిరంజీవి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ కాంబోలో రానున్న మూవీ గురించి అదిరిపోయే విషయాలు చెప్పారు చిరూ.

అనిల్ రావిపూడితో తాను చేసే చిత్రం ఫుల్‍ఫ్లెడ్జ్ కామెడీతో ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తాను కామెడీ ఎంటర...