భారతదేశం, మార్చి 19 -- భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. 8 రోజుల్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) నుంచి తిరిగి రావాల్సిన ఆమె అక్కడే చిక్కుకున్నారు. 286 రోజుల పాటు ఐఎస్ఎస్‍లో అంతరిక్షంలోనే గడిపారు.

సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగామి బిచ్ విల్మోర్ కూడా ఐఎస్ఎస్‍లో చికుకున్నారు. వీరు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం నేటి (మార్చి 19) తెల్లవారుజామున సునీత, విల్మోర్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్‍ఎక్స్‌కు చెందిన క్యాప్సూల్‍లో వీరు భూమి మీదకు వచ్చారు. ఈ విషయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా భాషలో వెల్‍కమ్ చెప్పారు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్టోరీ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్, గ్రేెటెస్ట్ అడ్వెంచర్ అంటూ నేడు చిరంజీవి ట్వీట...