Hyderabad, మార్చి 31 -- Chiranjeevi Praised Court Movie Nani And Gives Autograph: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'. ప్రియదర్శి, శివాజీ, హర్ష్‌ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా కోర్ట్ చిత్ర బృందాన్ని మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. నటీనటులు, దర్శకుడిని ఇంటికి పిలిచి మరి సత్కరించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "కోర్ట్ అందరూ గర్వపడే సినిమా....