భారతదేశం, ఫిబ్రవరి 22 -- Chiranjeevi: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఆద్యుడిగా పేరుతెచ్చుకున్న ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినీ జీవితంపై తెలుగులో మాస్ట‌ర్ ఆఫ్ స‌స్పెన్స్ హిచ్‌కాక్‌ పేరుతో ఓ బుక్ వ‌చ్చింది. సినీ ర‌చ‌యిత పుల‌గం చిన్నారాయ‌ణ‌తో పాటు ఐఆర్‌టీఎస్ అధికారి ర‌వి పాడి ఈ పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. మాస్ట‌ర్ ఆఫ్ స‌స్పెన్స్ హిచ్‌కాక్ బుక్ సెకండ్ ఎడిష‌న్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయం అని చిరంజీవి అన్నారు.

సెకండ్ ఎడిష‌న్ లాంఛ్ చేసిన అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ... ''హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలా...