భారతదేశం, ఫిబ్రవరి 8 -- మెగాస్టార్ చిరంజీవి.. గతేడాది దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. డ్యాన్సులకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా కైవసం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ స్థాయికి చేరిన చిరంజీవికి విశేష గుర్తింపులు దక్కుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు మరో గౌరవం కైవసం అయింది. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‍మెంట్ సమిట్ (WAVES) అడ్వయిజరీ బోర్డులో చిరంజీవికి చోటు దక్కింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమిట్ తొలిసారి ఈ ఏడాది ఇండియాలో జరగనుండగా.. చిరూకు ఈ బోర్డులో చోటిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చిరంజీవి నేడు (ఫిబ్రవరి 8) ధన్యవాదాలు తెలిపారు.

వేవ్స్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‍మెంట్, మీడియా రంగాల నుంచి ప్రమఖులు హాజరుకానున్నారు. ఈ రంగాల భవిష్యత్తుకు తీసుకోవాల్సిన ...