భారతదేశం, జనవరి 29 -- మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. రకరకాల పాత్రలు పోషించారు. కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ఇప్పటికీ ఫుల్ జోష్‍తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు తెలుగు హీరోలు గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో చిరంజీవి తనయుడు రామ్‍చరణ్ గ్లోబల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. తండ్రిని మించిన తనయుడిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఓ సినిమా రద్దు కాకపోయి ఉంటే 1998లోనే చిరంజీవి గ్లోబల్ స్టార్ అయ్యే అవకాశం ఉండేది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

1998లో చిరంజీవి హీరోగా అబు బాగ్ధాద్ గజదొంగ సినిమా షూటింగ్ మొదలైంది. ఇండియన్-హాలీవుడ్ భాగస్వామ్యంతో ఈ చిత్రం పట్టాలెక్కింది. ఈ మూవీ ఇంగ్లిష్ వెర్షన్‍కు భూషణ్ జెర్సీ, తెలుగు వెర్షన్‍కు సురేశ్ కృష్ణ దర్శకులుగా ఉన్నా...