భారతదేశం, ఏప్రిల్ 11 -- China - US tariff war: అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచినట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. చైనాపై అమెరికా అసాధారణంగా అధిక సుంకాలు విధించడం అంతర్జాతీయ, ఆర్థిక వాణిజ్య నిబంధనలు, ప్రాథమిక ఆర్థిక చట్టాలు, కామన్ సెన్స్ ను తీవ్రంగా ఉల్లంఘిస్తుందని, ఇది పూర్తిగా ఏకపక్ష బెదిరింపు, బలవంతం అని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

"చైనా ప్రయోజనాలను గణనీయమైన రీతిలో ఉల్లంఘించడాన్ని కొనసాగించాలని అమెరికా పట్టుబడితే, చైనా దృఢంగా, కచ్చితంగా ప్రతిచర్యలు తీసుకుంటుంది. చివరి వరకు పోరాడుతుంది" అని చైనా స్పష్టం చేసింది. అమెరికాకు ఎగుమతి అయ్యే చైనా వస్తువులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తే చైనా ఉపేక్షించదని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార...