భారతదేశం, ఏప్రిల్ 4 -- China tariffs on US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెసిప్రోకల్ టారిఫ్స్ ను ప్రకటించిన తరువాత ప్రతి చర్యగా యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై అదనంగా 34 శాతం సుంకం విధించనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. ఈ అదనపు సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా ప్రకటించింది.

"జాతీయ భద్రత, ప్రయోజనాలను మెరుగ్గా రక్షించడం మరియు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం వంటి అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడం లక్ష్యంగా ఈ అదనపు సుంకాలను విధించాం" అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 4 నుంచి అమెరికాకు సమరియం, గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోషియం, లుటియం, స్కాండియం, వైట్రియం వంటి మధ్యతరహా, భారీ అరుదైన ఖనిజాల ఎగుమతులపై మరింత నియంత్రణ విధిస్తామని చైనా ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం...