భారతదేశం, ఫిబ్రవరి 10 -- చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వీర రాఘవ రెడ్డి బృందం వెళ్లింది. రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నాని వీర రాఘవ రెడ్డి చెప్పారు. ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని కోరారు. అలా చేయడం కుదరదని రంగరాజన్ స్పష్టం చేశారు.

దీంతో తాను చెప్పినట్లు వినాలంటూ.. రంగరాజన్‌పై వీర రాఘవ రెడ్డి దాడి చేశారు. రంగరాజన్‌పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశారు. వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనపర్తి నియోజకవర్గ వాసిగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలకు వీర రాఘవ రెడ్డి తిరుగుతున్నట్టు తెలుస్తోంది. తమ సైన్యంలో చేరితే.. జీతం ఇస్తానంటూ ఆయన చెబుతున్నట్టు సమాచారం.

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్...