భారతదేశం, ఫిబ్రవరి 10 -- Chilkur Priest Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అభిప్రాయపడ్డారు.

"చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు. పోరాటం చేస్తున్నారు"- పవన్ కల్యాణ్

రామరాజ్యం సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక అర్చకులు రంగరాజన్ పై...