భారతదేశం, మార్చి 25 -- Children Movie ఆదిత్య‌, విక్కీస్ డ్రీమ్, డాక్ట‌ర్ గౌత‌మ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాల‌ను నిర్మించారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. కొంత గ్యాప్ త‌ర్వాత అభినవ్ పేరుతో మ‌రో చిల్డ్ర‌న్స్ మూవీని రూపొందించారు. డ్ర‌గ్స్ మాఫియాపై సందేశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - మన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన ...