Hyderabad, మార్చి 1 -- డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరే. కానీ, అదే పనిగా ఫోన్ వాడుతూ ఉంటే మానసికంగా సమస్యలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియాలో, అమెరికాలో జరిపిన అధ్యయనాలను బట్టి టీనేజ్ చివరి దశలో ఉన్నవారు, యుక్త వయస్సుకు వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్ వినియోగదారుల మెదడు ఆరోగ్యంపై జరిపిన గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ అనే అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలువడ్డాయి. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న 10వేల 475 మందిపై ఈ అధ్యయనం జరిపారు. ఒత్తిడికి గురి కావడం, ఆందోళన చెందుతుండటం అనే విభాగాల ఆధారంగా నిర్వహించారు. ఇందులో మగ పిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఎక్కువ సమస్యలు కలుగుతున్నట్లు తెలిసిందట. 65శాతం మంది ఆడపిల్లల్లో మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయని తేలింది.

ఈ స్టడీలో 13 ఏళ్ల వయస్సుకన్న పిల్లలు 14 ఏళ్లకు కాస్త హీ...