Hyderabad, మార్చి 8 -- పిల్లల కోర్కెలు తీర్చలేనప్పుడు బాధగా ఉంటుంది. కానీ, ప్రతి సందర్భంలోనూ పిల్లలు తాము అనుకున్నది తెచ్చివ్వాలంటూ మారం చేస్తుంటే మాత్రం మరింత ఆందోళన కలుగుతుంది. అసలు ఏం చేయాలి? పిల్లలు అడిగింది అడిగినట్లు చేసేయడమా? వారి కోర్కెలను పక్కకు పెట్టేయడమా? తల్లిదండ్రుల బాధ్యత ప్రకారం పిల్లల కోర్కెలను వాయిదా వేయడం ఎంతవరకూ కరెక్ట్ అనే ఆలోచనలో పడిపోయారా.. రండి. పిల్లల డిమాండ్లు, వాటి నెరవేర్చడం మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా వయస్సుతో పాటు వారి అవసరాలను, పిల్లల్లో కలుగుతున్న మార్పులను గమనించాలి. గతాన్ని ఈ రోజుతో పోల్చుకోవడం మానేయాలి. ప్రస్తుత అవసరాలను అర్థం చేసుకోగలగాలి. పిల్లల డిమాండ్లు వాటి వల్ల కలిగే ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. దానిని బట్టే ఆ కోరిక నెరవేర్చాలా వద్దా అనే నిర్ణయం తీ...