భారతదేశం, మార్చి 29 -- Child Welfare Committee Jobs: రాష్ట్రంలో చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో నియామ‌కాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. 91 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఏప్రిల్ 9 ఆఖ‌రు గ‌డువు విధించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని బాలల సంక్షేమం, సేవలు శాఖ డైరెక్ట‌ర్‌ ఎం. వేణుగోపాల్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఇందులో బాలల సంక్షేమ కమిటీల్లో ఒక్కొ జిల్లాలకు ఐదు ఖాళీలు చొప్పున 13 జిల్లాల‌కు 65 ఖాళీలు ఉన్నాయి. అలాగే జువెనైల్ జస్టిస్ బోర్డుల్లో ఒక్కో జిల్లాల‌కు రెండేసి ఖాళీలు చొప్పున 13 జిల్లాల‌కు 26 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 91 ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న...