ఆంధ్రప్రదేశ్,విజయవాడ, మార్చి 2 -- విజ‌య‌వాడలో పిల్ల‌ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టైంది. గడిచిన తొమ్మిది నెల‌ల్లోనే 26 మంది పిల్ల‌లను అమ్మేశారు. నిందితులను విచారించగా. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లు అయింది. అయితే అమ్మకానికి గురైన పిల్ల‌ల ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

శ‌నివారం విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ లీసులకు పిల్ల‌ల‌ను అక్ర‌మంగా విక్రయిస్తున్నట్లు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఈ వ్య‌వ‌హారంలోని సూత్ర‌దారిగా ఉన్న భ‌వానీపురానికి చెందిన బ‌ల‌గం స‌రోజిని (31)తో పాటు మ‌రో న‌లుగురు యువ‌తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ముఠా వ్య‌వ‌హారం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. వారివద్ద ఉన్న ముగ్గురు శిశువుల‌ను సంరక్షణలోకి తీసుకుని. శిశు సంర‌క్ష‌ణ అధికారుల‌కు అప్పగించారు.

పిల్ల‌లు...