భారతదేశం, మార్చి 17 -- జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, దద్దుర్లు కలిగించి.. దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి చికున్​గున్యా చికిత్సకు ఉపయోగపడే విధంగా ఉన్న ఒక ఔషధాన్ని ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐఐటీ రూర్కీ ప్రకారం.. హెచ్ఐవీ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించే ఎఫావిరెంజ్ అనే మందు చికున్​గున్యా వ్యాధికి సైతం సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది విట్రోతో పాటు ఎలుకల నమూనాల్లో చికున్​గున్యా వైరస్ రెప్లికేషన్​ని తగ్గిస్తుందని తేలింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మద్దతుతో ఐఐటీ రూర్కీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ల్యాబ్​లో వృద్ధిచెందిన సెల్​ కల్చర్స్​తో పాటు వ్యాధికు గురైన ఎలుకల్లో వైరస్​ స్థాయిలను ఈ ఎఫావిరెంజ్​ తగ్గించగలిగిందని అధ్యయనం ద్వారా తేలింది.

నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బ...