Hyderabad, ఏప్రిల్ 8 -- చికెన్ ప్రియులు ఎక్కువ మందే ఉన్నారు. ప్రతిరోజూ రెండు ముక్కలు తినకపోతే వారికి భోజనం చేసినట్టే ఉండదు. అందుకే ఒకేసారి రెండు, మూడు కిలోల చికెన్ తెచ్చుకొని ఫ్రిజ్ లో భద్రపరచుకొని ప్రతిరోజు వండుకుంటూ ఉంటారు. అయితే చికెన్ తాజాగా వారం పాటు ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. మీకు తెలియకుండానే చికెన్ పై బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుంది. అలాంటి చికెన్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చికెన్ వారం పాటు తాజాగా బ్యాక్టీరియా చేరకుండా ఎలా ఉంచాలో తెలుసుకోండి.

చికెన్ తాజాగా ఉండాలంటే ముందుగానే దాన్ని మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిజ్లో ఉంచడం బెటర్. ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసి నిమ్మరసం పెరుగు, వెనిగర్ వంటివి కలిపి డీ ఫ్రిజ్ లో పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి. చికెన్ మరిన్ని రోజులు తాజ...