Hyderabad, ఫిబ్రవరి 18 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది చికెన్, కోడిగుడ్లకు దూరంగా ఉండటంతో సేల్స్ పడిపోవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. కానీ, కొందరు ఆరోగ్య నిపుణులు చికెన్ తినడం ప్రమాదకరం కాదని చెప్తున్నారు. అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయి? చికెన్ తింటే, ఎందుకు ప్రమాదకరం కాదో తెలుసుకుందాం రండి.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, కోడి గుడ్లు తినాలనుకునే వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) కారణంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వైరస్ సోకిన ఏరియాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడాన్ని కూడా నిషేదించారు. ప...