Hyderabad, ఏప్రిల్ 3 -- ఉదయాన్నే రుచిగా ఏదైనా తినాలి, అది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసేది అయి ఉండాలి. తియ్యటి కమ్మటి ఆహారం అయితే మరీ బాగుంటుంది. ఇవన్నీ మీ మనసులో ఉన్న కోరికలు కదా. అవును ఇలా చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఇదే కోరుకుంటారు. కానీ ఆరోగ్యం గురించి భయపడి తీపి తినరు. రుచికరమైనవి తింటే ఆరోగ్యానికి మంచివి కాదని కొందరు, బరువు పెరుగుతామేమో అని మరికొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలా అని రోజూ చాలా గాబరా పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి వారే అయితే ఈ చియా సీడ్స్ పుడ్డింగ్ రెసిపీ మీ కోసమే.

చియా సీడ్స్ పుడ్డింగ్ రుచిలో అద్భుతమైనది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది తీపి తినాలనే మీ కోరికను కూడా నిస్సందేహంగా తీరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలనుకునే ...