భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఎండాకాలం వచ్చేస్తుంది.. ఫిబ్రవరి నెలలో వేడి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో ఒకటి చియా విత్తనాలు. ఈ చియా గింజలను జ్యూస్‌లో లేదా తాగే నీటిలో వేస్తే మంచిది. చియా గింజలను జ్యూస్ లేదా నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..

చియా విత్తనాలలో పోషకాలు : కేలరీలు-138, ప్రోటీన్-4.7 గ్రా, కొవ్వు-8.7 గ్రా, పిండి పదార్థాలు-11.9 గ్రా, ఫైబర్-9.8 గ్రా, రోజుకు అవసరమైన కాల్షియంలో 14 శాతం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ B1, విటమిన్ B3.

చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా శరీరాన్ని నిర్విషీకర...