భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఛత్తీస్​గఢ్​ బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సైతం మరణించారు.

మావోయిస్ట్​ ఏరివేత ఆపరేషన్​లో భాగంగా భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇంద్రావతి నేషనల్​ పార్క్​ ప్రాంతంలోని అడవుల్లో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్టు అధికారులు వివరించారు. గాయపడిన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వివరించారు.

మరణించిన మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

ఇదే బీజాపూర్​...