భారతదేశం, ఫిబ్రవరి 1 -- Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం 8.30 గంటల సమయంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పి తెలిపారు.

పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టుల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఐజీ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి...