భారతదేశం, ఏప్రిల్ 16 -- Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారని సరిహద్దు భద్రతా దళం మంగళవారం తెలిపింది. పక్కా సమాచారంతో బీఎస్ఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)తో కలిసి కాంకేర్ లోని చోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండా ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా బీఎస్ఎఫ్ బృందంపై నక్సలైట్లు అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ బలగాలు వారిపై ఎదురుదాడికి దిగడంతో ఎన్ కౌంటర్ (encounter) జరిగింది.

ఇప్పటివరకు ఈ ఎదురకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారని, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ కల్యాణ్ ఎలెసెలా వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాల...