భారతదేశం, మార్చి 26 -- Chhattisgarh Encounter: చత్తీస్‌ ఘడ్‌ ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లాకు చెందిన అంకేశ్వరపు సారయ్య ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమ బాటలోనే నడిచిన సారయ్య ఎన్ కౌంటర్ లో మరణించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఓరుగల్లు ఉద్యమాల చరిత్రలో కీలకంగా చెప్పుకునే అంకేశ్వరపు సారయ్య మరణంతో తరాలపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.

కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన అంకేశ్వరపు వెంకటయ్య, ఎల్లమ్మ దంపతులకు 1968 లో సారయ్య(57) జన్మించాడు. వెంకటయ్య రైల్వే కార్మికుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎల్లమ్మ, వెంకటయ్య కాలం చేశారు. అంకేశ్వరపు సారయ్య 1982-83 లో తరాలపల్లి సమీపంలోని కొండపర్తీ గ్రామంలో పదో తరగతి వరకు చదివాడు. బడి చదువుల వయసులోనే అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడయ...