భారతదేశం, ఫిబ్రవరి 14 -- Chhaava Twitter Review: విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన బాలీవుడ్ మూవీ ఛావా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్న సినిమాల్లో ఒక‌టిగా రిలీజైన ఛావా టాక్ ఎలా ఉందంటే?

ఛ‌త్ర‌ప‌తి శివాజీ త‌న‌యుడు శంభాజీ జీవితం ఆధారంగా హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీగా ఛావా తెర‌కెక్కింది. ఛావా మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. స్టోరీ, యాక్ష‌న్ సీక్వెన్స్, విజువ‌ల్స్ అద్భుత‌మంటూ నెటిజ‌న్లు చెబుతోన్నారు. మాస్ట‌ర్ పీస్ మూవీ ఇద‌ని అంటున్నారు.

ఆద్యంతం ఊపిరి బిగ‌ప‌ట్టి చూసేలా గ్రిప్పింగ్‌గా ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ఛావా మూవీని తెర‌క...