భారతదేశం, ఏప్రిల్ 12 -- బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఛావా తెలుగులోకి వ‌చ్చింది. డిసెంబ‌ర్ 11న ఛావా హిందీ వెర్ష‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్ మాత్రం ఒక రోజు ఆల‌స్యంగా శ‌నివారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కేవ‌లం హిందీ, తెలుగు భాష‌ల్లో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతోంది. త్వ‌ర‌లో త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిసింది

ఛత్రపతి శివాజీ త‌న‌యుడు శంభాజీ మహారాజ్ జీవితం హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ఛావా సినిమాను తెర‌కెక్కించాడు. మోస్తారు అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల‌ను పూర్తిగా త‌ల‌క్రిందులు చేస్తూ 800కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ ఏడాది హిందీలోనే కా...