భారతదేశం, మార్చి 6 -- Chhaava Movie: బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఛావా మూవీ తెలుగులో మార్చి 7న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీలో విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఛావా సినిమాను తెలుగులో జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాస్ రిలీజ్ చేస్తోన్నారు.

కాగా రిలీజ్‌కు మ‌రో రోజు మాత్ర‌మే ఉండ‌గా ఛావా వివాదంలో చిక్కుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ ముస్లిం ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ డిమాండ్ చేస్తోన్నారు.

ఛావా రిలీజ్‌ను ఆపాలంటూ నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌కు మెమోరాండం స‌మ‌ర్పించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి ఛావా సినిమా తీశార‌ని మెమోరండంలో జియా ఉల్ హాక్ పేర్కొన్న‌ట్లు తెలిసింది. ముస్లింల‌ను ఈ మూవీలో త‌ప్పుగా చూపించార‌ని వెల్ల...