భారతదేశం, మార్చి 4 -- ఛావా సినిమా కలెక్షన్లలో దూకుడు చూపిస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిస్టారికల్ హిందీ యాక్షన్ మూవీ రూ.500కోట్ల గ్రాస్ కలెక్షన్లను కూడా దాటేసింది. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీ ఇంకా జోరుగా వసూళ్లను దక్కించుకుంటోంది. ఇంతటి క్రేజ్ దక్కించుకున్న ఛావా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లోనూ థియేటర్లలోకి వస్తోంది. మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ విడుదల కానుంది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం రూపొందింది. ఈ మూవీ మెప్పించేలా ఉండటంతో హిందీలో భారీ కలెక్షన్లతో ఇప్పటికే బ్లాక్‍బస్టర్ అయింది. మరాఠా యోధుల కథ కావడంతో ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలను దక్కించుకుంది.

అయితే, నార్త్ ఆడియన్స్‌లా సంభాజీ మహరాజ్ కథ తెలుగు ప్రేక్షక...