Hyderabad, ఫిబ్రవరి 26 -- Chhaava in Telugu: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా ఇది. 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి మరో వారంలో తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

ఛావా మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా పెరుగుతూ వెళ్లాయి. ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ కూడా దాటేసింది. మూవీకి వస్తున్న పాజిటివ్ రివ్యూల నేపథ్యంలో తెలుగులోనూ తీసుకురావాలని ఇక్కడి ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.

మొత్తానికి మార్చి 7న ఛావా మూవీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయనుండటం విశేషం. తెలుగు ర...