Hyderabad, మార్చి 27 -- చూయింగ్ గమ్ నమలడం యువతకు ఎంతో ఇష్టం. దాన్ని నములుతూ బెలూన్ లా ఊదుతూ ఆనందిస్తారు. అది మనం నమిలి ఉమ్మేస్తాం కదా దానితో ఏ సమస్యా ఉండదనుకుంటారు. నిజానికి మీకు తెలియకుండానే చూయింగ్ గమ్ రూపంలో ప్లాస్టిక్‌ను నమిలేస్తున్నారు. ఒక చూయింగ్ గమ్‌లో ఎన్నో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. అవి మీకు తెలియకుండానే మీ శరీరంలో చేరుతాయి.

ఒక చూయింగ్ గమ్ నమలడం వల్ల వందలాది చిన్న ప్లాస్టిక్ ముక్కలు నేరుగా ప్రజల నోట్లోకి విడుదల అవుతాయి. దీన్ని తినడం ఎంతో ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, పర్వతాల శిఖరాల నుండి సముద్రం అడుగు వరకు మనం పీల్చే గాలిలో కూడా మైక్రోప్లాస్టిక్స్ అని పిలిచే చిన్న ప్లాస్టిక్ ముక్కలను చేరిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మన ఊపిరితిత్తులు, రక్తం, మెదడుతో సహా మానవ శరీరాల అంతటా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట...