Hyderabad, ఏప్రిల్ 8 -- మీ ఛాతీలో కలిగే మంట అసౌకర్యంగా అనిపిస్తుందా.. దీని కారణంగా మీరు రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా..? లేదా నిద్ర సరిగా పట్టడం లేదా? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. రాత్రి గుండెల్లో మంట పుట్టే ఫీలింగ్, నిద్రపోతున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి ప్రయాణించినప్పుడు ఇది జరుగుతుంది. దీనికి ఉపశమనం కోసం కొన్ని రకాల మందులు వాడొచ్చు. కానీ, గుండెల్లో మంటను నివారించడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి.

ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీకు అసౌకర్యాన్ని కలిగించి, మంచి నాణ్యమైన నిద్రను నిరోధిస్తుంది. మరుసటి రోజు మీకు బద్దకంగా లేదా అలసటగా ఫీలవుతుంటారు. ఈ సమస్యకు ప్రముఖ డాక్టర్ సౌరభ్ సేథీ పరిష్కారం చెబుతున్నారు. రాత్రిపూట గుండెల్లో మంట పరిస్థితిని నివారించడానికి కొన్ని సహజ మార్గాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నార...