భారతదేశం, మార్చి 17 -- చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.

'రాజకీయాలు కలుషితమయ్యాయో.. నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదు. వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుత...