భారతదేశం, ఫిబ్రవరి 4 -- Cherlapally Fire Accident : చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫేస్ 1లోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఇతర కంపెనీలకు వ్యాపిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

రసాయన పరిశ్రమ పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్‌ కంపెనీకి మంటలు వ్యాపించాయి. రసాయనాల ఘాటుతో స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చర్లపల్లి పారిశ్రామికవాడలో సర్వోదయ సాల్వెంట్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ...