భారతదేశం, అక్టోబర్ 13 -- మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారా? మీ దగ్గర క్రెడిట్​ కార్డులు ఉన్నాయా? లేక కొత్తది తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! క్రెడిట్​ కార్డు రివార్డ్ పాయింట్లను ఉపయోగించి విమాన టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లను లేదా ఉచిత ప్రయాణాలను పొందవచ్చని మీకు తెలుసా? అన్ని క్రెడిట్ కార్డులు ఈ ప్రయోజనాలు ఇవ్వవు కానీ ప్రత్యేకంగా ట్రావెల్ బెనిఫిట్స్ అందించే కార్డులు కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడే కొన్ని ఉత్తమమైన క్రెడిట్ కార్డుల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

1. యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్:

ఈ కార్డుతో మీరు ఏ విమానయాన సంస్థను ఎంచుకున్నా, ప్రతి ప్రయాణంపై రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

ప్రయాణ ఖర్చులపై ప్రతి రూ. 100 ఖర్చుకు 5 EDGE మైల్స్ వస్తాయి. ఇక్కడ 1 EDGE మైల్ ఒక రూపాయ...