Hyderabad, మార్చి 31 -- చాట్ జిపిటిలో గిబ్లీ స్టైల్ ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. చాట్ జీపీటీ అనేది ఈ రోజు దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిన ఒక కృత్రిమ మేధ. ఓపెన్ ఏఐ విడుదల చేసిన చాట్ జిపిటిలో ఒక కొత్త రకం గిబ్లీ. ఇది విడుదలైన మూడు రోజలకు విపరీతమైన ప్రజాదరణ పొందింది. చాట్ జిపిటి వినియోగదారులే కాకుండా, తమ ఫోటోలు యానిమేషన్ లో కావాలనుకునే వారు కూడా చాట్ జిపిటి ద్వారా గిబ్లీ కళను ప్రయత్నిస్తున్నారు. మీకు కూడా ఈ గిబ్లీ చాలా నచ్చుతుంది. ఏ ఫోటోనైనా యానిమేషన్ లోకి మార్చడం దీని ప్రత్యేకత. మీరు కూడా మీ ఫోటోలను గిబ్లీలోకి మార్చాలనుకుంటే ఎలా చేయాలో ఇక్కడ మేము చెప్పాము. ఈ చిట్కాలు పాటిస్తే సరి.

ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో గిబ్లీ స్టైల్ చిత్రాలు ట్రెండవుతున్నాయి. చాలా మంది యూజర్లు సొంతంగా గిబ్లీని క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చే...