భారతదేశం, ఏప్రిల్ 4 -- ChatGPT Aadhaar card: స్టూడియో గిబ్లి-శైలి పోర్ట్రెయిట్ల మేనియా కొనసాగుతుండగానే, కృత్రిమ మేథకు సంబంధించి మరో అంశం తెరపైకి వచ్చింది. చాట్ జీపీటీని ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులను, నకిలీ పాన్ కార్డులను సృష్టించే సామర్ధ్యాలు తెరపైకి వచ్చాయి. ఏకంగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్ మన్ ల ఆధార్ కార్డులు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చాట్ జీపీటీ లోని కొత్త ఇమేజ్ జనరేటర్ ను ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులను సృష్టించడం ప్రారంభించారు. కృత్రిమ మేధ కంపెనీలు తప్పుడు చేతుల్లో దుర్వినియోగం అయ్యే ఫీచర్లను ప్రవేశపెట్టడం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఫోటోరియలిస్టిక్ చిత్రాలను సృష్...