HYderabad, మార్చి 11 -- చపాతీలు, రోటీలు అధికంగా తింటున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. బరువు తగ్గాలన్న కాంక్షతో రాత్రిపూట చపాతీలనే తింటున్నారు. ప్రతిరోజూ చపాతీలు చేసుకునేందుకు బద్దకించి పిండిని ఒకసారే కలిపి రెండు మూడు రోజులపాటు ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటారు. ప్రతిరోజు రాత్రి కాస్త ముద్దను తీసి చపాతీలుగా ఒత్తుకొని కాల్చుకొని తింటున్నారు. ఇలా ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పిండితో చపాతీలు చేసుకుని తినడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచిన పిండి ఎంతో హానికరం. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరిస్తున్నారు.

ఫ్రిజ్లో ఉంచిన పిండితో చపాతీలు చేయడం వల్ల ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

రిఫ్రిజిరేటర్ లో ఉంచిన చపాతీ పిండి త్వరగానే పులిసిపోతుంది. ఇందులో ఈస్ట్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫంగల్ ఇన్...