భారతదేశం, ఏప్రిల్ 3 -- Chapata Chilli:వరంగల్‌ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఈ మేరకు భౌగోళిక గుర్తింపు సంస్థ (జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ) సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి 18వ ఉత్పత్తిగా చపాటా మిర్చి జీఐ ట్యాగ్ పొందినట్లయ్యింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘంతో పాటు మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీకొండా లక్ష్మన్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది.

2022లోనే చెన్నైలోని ఇండియన్ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేశారు. దీంతో దాదాపు మూడేళ్లకు టపాట మిర్చికి ఆ సంస్థ జీఐ ట్యాగ్ సర్టిఫికేట్ జారీ చేయగా.. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉ...