భారతదేశం, మార్చి 7 -- Chandrayaan-3: గతంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా చంద్రుడి ధ్రువాల వద్ద మంచు నిక్షేపాలు ఉన్నట్లు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ డేటా ద్వారా తేలింది. చంద్రుడి ఉపరితలం క్రింద ధృవాలకు సమీపంలో ఎక్కువ ప్రదేశాలలో మంచు ఉండవచ్చని చంద్రయాన్ 3 ప్రయోగ డేటా సూచిస్తుంది. ఈ అధ్యయనం 'కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్' లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం, స్థానిక ఉష్ణోగ్రతలోని వైవిధ్యాలు మంచు ఏర్పడటాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో హైలైట్ చేస్తుంది.

ఈ మంచు కణాలను పరిశీలించడం ద్వారా చంద్రుడి ప్రారంభ భౌగోళిక చరిత్రపై అవగాహన ఏర్పడుతుందని అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీకి చెందిన ప్రధాన రచయిత డాక్టర్ దుర్గా ప్రసాద్ కరణం వివరించారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ లోని 'చాస్టే' ప్రోబ్ నమోదు చేసిన చంద్రుడి ఉపరితలం కింద 10 సెంటీమీటర్ల...