భారతదేశం, ఏప్రిల్ 8 -- అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు.. ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు.. 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైనే దృష్టిపెట్టారు.

ఈ పనుల్లోపడిన సీఎం నాడు సొంతి ఇంటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అమరావతిలో నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలు ఎక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. నిర్మాణాలు ప్రారంభించారు. దేశ, విదేశీ సంస్థ...