భారతదేశం, జనవరి 28 -- Chandrababu Cases : సుప్రీం కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసుల విచార‌ణ‌ను సీఐడీ నుంచి సీబీఐకి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మ‌రోవైపు పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క మాట మాట్లాడినా భారీ జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చరించింది.

గ‌త వైసీపీ ప్రభుత్వ హ‌యంలో అప్పటి ప్రతిప‌క్ష నేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇసుక‌, ఇన్నర్ రింగ్ రోడ్డు, మ‌ద్యం, స్కిల్ డెవల‌ప్‌మెంట్ త‌దిత‌ర ఏడు కేసుల‌ను న‌మోదు చేసింది. ఆ కేసుల‌ను అప్పటి నుంచి రాష్ట్రంలోని సీఐడీ దర్యాప్తు జ‌రుపుతోంది.

అయితే గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలో వ‌చ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయ‌న కేసుల విచార‌ణ‌ను ప్రభావితం చేసే అవ‌క...