భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు. తన విధానాల ద్వారా ప్రజల జీవితాలను మార్చేందుకు ప్రయత్నించారు. సామాజిక, వ్యాపార, ఆర్థిక విధానాలను ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలో చెప్పాడు. సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పించే అనేక విధానాలు చాణక్యనితిలో పేర్కొ్న్నాడు.

మంచి జీవితానికి డబ్బు ఉండటం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. కొన్ని విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి డబ్బును ఆదా చేయవచ్చు. దాని సరైన ఉపయోగం గురించి సమాచారాన్ని పొందవచ్చు. డబ్బుపై చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం.

లక్ష్మి సంపదలకు దేవత. ఆచార్య చాణక్యుడు ప్రకారం, డబ్బును నీళ్లలా ఖర్చు చేసేవారిని, చెడు సమయాలలో డబ్బును పొదుపు చేయని వారిని మూర్ఖులు అంటారు. అలాంటి వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరం విలాసాల క...