భారతదేశం, మార్చి 18 -- Chanaka korata Sadarmat Projects : ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న పెన్ గంగా నదిపై బ్యారేజీని నిర్మించాలనే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో 2016వ సంవత్సరంలో రూ.386 కోట్ల అంచనా వ్యయంతో కొరాట- చనాక బ్యారేజి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదేండ్లుగా పనులు నెమ్మదిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయితే అదిలాబాద్ ఇంకా బోథ్ నియోజక వర్గాల్లో సుమారు 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడిఆశలుగానే మిగిలిపోతున్నాయి. పదేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధికారులు మాత్రం బ్యారేజీకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే పనులను తిరిగి చేపడతాం అని స్పష్టం చేస్తున్నారు.

చనాక బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయిన...