Hyderabad, మార్చి 3 -- పిల్లలు ఇష్టపడే స్నాక్స్‌లో మిక్చర్ ముందు వరుసలో ఉంటుంది. కారం కారంగా ఉండే రుచికరమైన మిక్చర్ అంటే పెద్దలకు కూడా మోజు ఎక్కువే అనుకోండి. అయితే మిక్చర్ లలో శనగపప్పులతో తయారు చేసిన చనా దాల్ నంకీన్ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. స్వీటు షాపుల్లో, బేకరీల్లో ఇది ఎప్పుడు కనిపించినా కొనే వరకూ పిల్లలు ఊరుకోనే ఊరుకోరు. అలాంటి చనా దాల్ నంకీన్ ను ప్రతిసారి బయట నుంచి కొని తీసుకొచ్చే బదులు ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని చాలా మంది తల్లులు అనుకుంటారు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే ఈ రెసిపీ మీ కోసమే. ఈ సింపుల్ రెసిపీతో శనగపప్పులతో చనా దాల్ నంకీన్ ను చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకుని ఆస్వాదించవచ్చు.

వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలిచొరబడని కంటైనర్లో వేసి మూత పెట్టారంటే 15 రోజుల పాటు నిల్వ చేసు...