భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమవుతోంది. దుబాయ్‍లో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టోర్నీ రేపు (ఫిబ్రవరి 19) మొదలుకానుండగా.. తన తొలి మ్యాచ్‍ను బంగ్లాదేశ్‍తో ఫిబ్రవరి 20న భారత్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేనల్ స్టేడియంలో టీమిండియా తలపడనుంది. ఇంతలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తలిగింది. భారత బౌలింగ్ కోచ్ మార్న్ మార్కెల్ జట్టుకు దూరమయ్యాడు. తన స్వదేశం దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు.

మార్న్ మోర్కెల్ తండ్రి మృతి చెందారని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‍లో మోర్కెల్ ఉన్నా.. రెండో సెషల్‍లో కనిపించలేదని పేర్కొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు దుబాయ్ నుంచి మోర్కెల్ బయలుదేరాడని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

మోర్కెల్ మళ్లీ భారత జట్టుతో ఎప్పుడు జాయిన్ అవుతాడో క్...